Kingdom Review: మూవీ రివ్యూ: కింగ్డమ్
చిత్రం: కింగ్డమ్ రేటింగ్: 2.5/5 తారాగణం: విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకిటేష్ వి.పి, అయ్యప్ప శర్మ, గోపరాజు రమణ, మహేష్ ఆచంట, మురళిధర్, రోహిణి తదితరులు కెమెరా: గిరీష్ గంగాధరన్, జోమొన్ టి జాన్ కూర్పు: నవీన్ నూలి సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్ నిర్మాత: నాగ వంశి, సాయి సౌజన్య రచన- దర్శకత్వం: గౌతం తిన్ననూరి విడుదల: 31 జూలై 2025 విజయ్ దేవరకొండ హిట్ ని చవి చూసి చాలా నాళ్లయ్యింది. అలాగే “మిస్టర్ బచ్చన్” తో అరంగేట్రం చేసిన భాగ్యశ్రీకి ఆ చిత్రం కలిసిరాలేదు. ఎప్పుడో “జెర్సీ”తో తన ఉనికిని చాటుకున్న గౌతం తిన్ననూరి ఆ స్థాయి సినిమా చేసింది లేదు. ఈ ముగ్గురి కలయికలో వచ్చిన ‘కింగ్డమ్” టీజర్ తో “కేజీఎఫ్” వైబ్స్ తీసుకొచ్చింది. ట్రైలరుతో అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకీ ఇందులో ఉన్నదేంటో చూద్దాం. కథ 1920 లొ శ్రీకాకుళం లో మొదలవుతుంది. తెల్లదొరలతో అక్కడొక తెగ పోరాడుతుంది. ఆ తెగ నాయకుడు (విజయ్ దేవరకొండ) ఆ తెగకు చెందిన పిల్లల్ని మాత్రం కాపాడి వీరమరణం చెందుతాడు . ఆ పిల్లలు సముద్రం దాటి శ్రీలంకకు చేరి అక్కడ బతుకుతూ ఉంటారు. తమ నాయకుడు రెండవ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కట్ చేస్తే, సూరి (విజయ్ దేవ...