Posts

Kingdom Review: మూవీ రివ్యూ: కింగ్డమ్

Image
చిత్రం: కింగ్డమ్ రేటింగ్:  2.5/5 తారాగణం: విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకిటేష్ వి.పి, అయ్యప్ప శర్మ, గోపరాజు రమణ, మహేష్ ఆచంట, మురళిధర్, రోహిణి తదితరులు కెమెరా: గిరీష్ గంగాధరన్, జోమొన్ టి జాన్ కూర్పు: నవీన్ నూలి సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్ నిర్మాత: నాగ వంశి, సాయి సౌజన్య రచన- దర్శకత్వం: గౌతం తిన్ననూరి విడుదల: 31 జూలై 2025 విజయ్ దేవరకొండ హిట్ ని చవి చూసి చాలా నాళ్లయ్యింది. అలాగే “మిస్టర్ బచ్చన్” తో అరంగేట్రం చేసిన భాగ్యశ్రీకి ఆ చిత్రం కలిసిరాలేదు. ఎప్పుడో “జెర్సీ”తో తన ఉనికిని చాటుకున్న గౌతం తిన్ననూరి ఆ స్థాయి సినిమా చేసింది లేదు. ఈ ముగ్గురి కలయికలో వచ్చిన ‘కింగ్డమ్” టీజర్ తో “కేజీఎఫ్” వైబ్స్ తీసుకొచ్చింది. ట్రైలరుతో అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకీ ఇందులో ఉన్నదేంటో చూద్దాం. కథ 1920 లొ శ్రీకాకుళం లో మొదలవుతుంది. తెల్లదొరలతో అక్కడొక తెగ పోరాడుతుంది. ఆ తెగ నాయకుడు (విజయ్ దేవరకొండ) ఆ తెగకు చెందిన పిల్లల్ని మాత్రం కాపాడి వీరమరణం చెందుతాడు . ఆ పిల్లలు సముద్రం దాటి శ్రీలంకకు చేరి అక్కడ బతుకుతూ ఉంటారు. తమ నాయకుడు రెండవ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కట్ చేస్తే, సూరి (విజయ్ దేవ...

చిత్రం: హరిహర వీరమల్లు

Image
చిత్రం: హరిహర వీరమల్లు రేటింగ్:  1.75/5 తారాగణం:  పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, నాజర్, సునీల్, సుబ్బరాజు, బాబీ డియోల్, అయ్యప్ప శర్మ, సత్యరాజ్, పూజిత పొన్నాడ, అనసూయ, దలిప్ తహిల్, సచిన్ ఖేదేకర్, కోట శ్రీనివాసరావు, రఘుబాబు తదితరులు కెమెరా:  జ్ఞాన శేఖర్, మనోజ్ పరమహంస ఎడిటింగ్:  ప్రవీణ్ సంగీతం:  కీరవాణి కథ:  క్రిష్ జాగర్లమూడి నిర్మాత:  ఎ.ఎం రత్నం దర్శకత్వం:  క్రిష్, జ్యోతి కృష్ణ విడుదల:  24 జూలై 2025 2019 లో శ్రీకారం చుట్టుకున్న ఈ చిత్రం ఆరేళ్లకి తెర మీదకొచ్చింది. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత తెర మీదకొచ్చిన ఆయన తొలి చిత్రమిది. ఆయన రాజకీయ ప్రస్థానం వల్ల కొంత, ఇతర కారణాల వల్ల మరికొంత షూటింగులు వాయిదా పడుతూ తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలని ఏర్పరచుకోలేకపోయింది. నానా పురిటి నొప్పులు పడ్డాక కూడా విడుదల వాయిదా పడడం వల్ల ఈ చిత్రంపై ఆసక్తి ఇంకాస్త సన్నగిల్లింది. ప్రచార సామగ్రి కూడా అంతగా ఆకట్టుకోకపోవడం వల్ల మరింత డీలా పడింది. అయితే ఎట్టకేలకి పవన్ కళ్యాణ్ స్టార్ వేల్యూ వలన ఆఖరి వారంలో కాస్త వేడి పుంజుకుంది. ఐదేళ్లు జాడీలో ఊరపెట్టి తీసిన ఈ వీరమల్లు ఎలా ...